అలాంటివాళ్ల ఇన్ఫర్మేషన్ ఇస్తే రూ.11 వేలు

  • యూపీ బీజేపీ ఎంపీ ప్రకటన

లక్నో: ఫారిన్ టూర్ చరిత్ర కలిగిన వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ఇచ్చినవారికి, ఢిల్లీలోని తబ్లిగి జమాత్​కు పోయొచ్చినోళ్ల సమాచారం ఇచ్చినవాళ్లకు నగదు బహుమానం ఇస్తానని బీజేపీ ఎంపీ ప్రకటించారు. తమ ప్రయాణాల గురించిన సమాచారం దాచిపెట్టి, కరోనా టెస్టులకు దూరంగా ఉంటున్న జమాత్ సభ్యులతో సహా ఫారిన్ టూర్ పోయొచ్చినోళ్ల ఇన్ఫర్మేషన్ అందించే ఎవరికైనా రూ.11,000 ఇస్తానని యూపీ బీజేపీ ఎంపీ రవీంద్ర కుషావహ శనివారం అన్నారు. ఫారిన్, తబ్లిగి వెళ్లివచ్చిన చాలామంది అధికారులకు చెప్పడంలేదని, వారు టెస్టులు చేయించుకోకుండానే ఇండ్లలో ఉంటున్నారని అన్నారు. ‘‘దయచేసి అటువంటి వారు ఎవరున్నా స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. అలాంటి వ్యక్తుల గురించి తెలిసినవాళ్లు సమాచారమిస్తే తప్పకుండా నగదు బహుమానం ఉంటుంది”అని ఆయన మీడియాతో అన్నారు. ఢిల్లీలో జరిగిన తబ్లిగి కార్యక్రమానికి హాజరైన వారి ద్వారా కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు.
ఢిల్లీలో జరిగిన తబ్లిగి కార్యక్రమంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. జమాత్ గురించిన వార్తలు వెలువడిన వెంటనే.. ఆ ఏరియాను కరోనా హాట్​స్పాట్​ గా అధికారులు ప్రకటించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా స్వచ్చందంగా వచ్చి రిపోర్టు చేయాలని పోలీసులు పలు మార్లు కోరారు. కానీ, ఎవరూ ముందుకు రాకపోగా.. ఇప్పటివరకు తబ్లిగి జరిగిన ఏరియాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఓ అధికారి మీడియాకు వెల్లడించారు.

Latest Updates