అలాంటి సీన్స్ ఎందుకు తీస్తారో ఇప్పటికీ అర్ధం కావడంలేదు

Ileana-D'Cruz మొదటి సినిమా “దేవదాస్” తోనే  మంచి విజయం అందుకున్న ఇలియానా  సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే బాలీవుడ్‌ లో అడుగుపెట్టి  అదృష్టాన్ని పరిక్షించుకుంది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్‌డం సంపాదించుకుంది. ప్రస్తుతం అజయ్‌ దేవగణ్‌ సరసన “రెయిడ్” సినిమాలో నటిస్తుంది ఇలియానా. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది, ఉత్తరాది సినిమా పరిశ్రమలపై తన అభిప్రాయాన్ని గురించి ఇలియానా మాట్లాడుతూ…

నేను తెలుగు సినిమాల్లో నటిస్తున్నప్పుడు అక్కడ సినిమాలు ఎలా తీస్తారో తెలిసేది కాదు. నా ఫస్ట్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మొదటి రోజు నా నడుముపై శంఖం వేసిన సీన్ షూట్ చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారని డైరక్టర్ ని అడిగాను. అందుకు ఆయన నీ నడుము చాలా బాగుంది. ఈ సీన్ తీస్తే ఇంకా బాగుంటుందన్నారు. అయితే  అందులో లాజిక్ ఏంటో ఇప్పటికీ‌ అర్థం కావడంలేదు. నడుము సీన్ తీస్తున్న ప్రతి సారీ నీ నడుము చాలా బాగుంది  అనేవారు. భారతీయ మహిళల అందాన్ని సినిమాల్లో ఈ విధంగా చూపిస్తుంటారు. అయితే నాకు మాత్రం అది సినిమా షూటింగ్ లో ఓ భాగం మాత్రమే. ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు త్వరగా చేసేయాలని అనుకుంటా. కానీ నాకు ఈ సీన్స్ లలో నటించడం ఇష్టంలేదు. బాలీవుడ్‌లో మాత్రం ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదు. దక్షిణాది పరిశ్రమ ఇంకా మారలేదు. ఇలాంటి సీన్ లు ఇప్పటికీ కన్పిస్తున్నాయి. బహుశా టాలీవుడ్‌లో మహిళల అందాన్ని ఇలాగే చూస్తారేమో. నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడే దక్షిణాదిన ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ అవన్నీ డబ్బు కోసమే చేశాను. నేను ఏడో చిత్రం చేస్తున్నప్పుడు ఇలా డబ్బు కోసమే సినిమాలు చేయడం మానుకోవాలని నిర్ణయించుకున్నాను. అని ఇలియానా తెలిపింది.

 

Posted in Uncategorized

Latest Updates