అలా ఎలా మాట్లాడతారు : బాబు గోగినేనికి హైకోర్టు నోటీసులు

మత విశ్వాసాలను కించపర్చడంతోపాటు ఆధార్ సమాచారాన్ని విదేశాలకు చేరవేస్తున్నాడని హేతువాది బాబు గోగినేనిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. బాబు గోగినేని వ్యవహారంపై జూన్ 25న హైదరాబాద్ మాదాపూర్ చెందిన వీరవెంకటనారాయణ కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు గోగినేనిపై పోలీసులు 11 సెక్షన్ల కింద కేదు నమోదు చేశారు. పోలీసులు బాబు ఇంటికి నోటీసులు పంపించినప్పటికీ ఆయన బిగ్ బాస్ షోలో ఉండటంతో విచారణకు హాజరుకాలేదు.

దీంతో పిటిషనర్ వీరవెంకటనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. జూలై 25లోపు బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు.. సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది. దీంతో CRP41A సెక్షన్ ప్రకారం ఆయనకు, బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు మాదాపూర్ పోలీసులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో బాబు గోగినేని షో నుంచి బయటకు వచ్చి విచారణకు హాజరు అవుతారా లేదా అనే చూడాలి. లేకపోతే షో ముగిసిన తర్వాతే వస్తానని కోర్టుకి తెలియజేస్తారో చూడాలి..

Posted in Uncategorized

Latest Updates