అలా బ్యాన్.. ఇలా సడలింపు : మళ్లీ గ్రౌండ్ లోకి స్టీవ్‌ స్మిత్‌

stevsmithఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ త్వరలోనే మళ్లీ గ్రౌండ్ లో అడుగు పెట్టబోతున్నాడు. జూన్ నెలలో కెనడాలో జరిగే గ్లోబల్‌ టీ-20 లీగ్‌లో స్మిత్ ఆడనున్నాడు. ఈ నిర్ణయం అందరినీ షాకింగ్ కు గురి చేసింది. ఇటీవలే బాల్ ట్యాంపరింగ్ లో ఏడాది కాలం నిషేధానికి గురయ్యాడు. ఇంతలోనే సడలింపు ఇవ్వటంతో.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు స్టీవ్ స్మిత్. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా.. స్మిత్‌పై ఏడాది నిషేధం విధించింది. దీంతో BCCI కూడా IPLలో ఆడేందుకు అనుమతించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఓ సడలింపు ఇచ్చింది. ఆస్ట్రేలియా బయట జరిగే టోర్నమెంట్లలో ఆయా బోర్డుల అనుమతితో పాల్గొనవచ్చు అని వెల్లడించింది. ఈ క్రమంలోనే కెనడాలో జరిగే కెనడా టీ-20 లీగ్ లో అడుగు పెడుతున్నాడు స్టీవ్ స్మిత్.

 

 

Posted in Uncategorized

Latest Updates