అలిగిన అనసూయ : సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్

Anasuya-Bharadwaj-deleప్రముఖ యాంకర్ అనసూయ షాకింగ్ ఇచ్చింది. అభిమానులు ఊహించని నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం నుంచి వెళ్లిపోయింది. తన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేసింది. అన్ని అకౌంట్లు డిలీట్ చేసింది. చిన్నారి ఫోన్ పగలగొట్టిన అంశంలో.. అనసూయపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నెటిజన్లు విపరీతంగా స్పందించారు. వీటిలో ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. దీనిపై అనసూయ వివరణ ఇచ్చినా.. నెటిజన్లు శాంతించలేదు. మళ్లీ విమర్శలు చేశారు. ఎక్కువ మంది వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. దీంతో సోషల్ మీడియా నుంచి ఎగ్జిట్ అయినట్లు సమాచారం.

ట్విట్టర్ అకౌంట్ కు లాగిన్ అయితే.. సారీ.. దిస్ అకౌంట్ డజ్ నాట్ ఎగ్జిట్ అని మెసేజ్ వస్తుంది. ఫేస్ బుక్ లోనూ కనిపంచలేదు. నెటిజన్ల నెగిటివ్ కామెంట్ల వల్లే అనసూయ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates