అల్జీరియాలో విమానం క్రాష్ : 257కి చేరిన మృతుల సంఖ్య

plane ACCIDENTఅల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం క్రాష్ లో 257 మంది చనిపోయినట్లు స్టేట్ టీవీ వెల్లడించింది. చనిపోయిన వారంతా అల్జీరియా రక్షణ శాఖకు చెందినవారేనని ప్రకటించింది. బౌఫారిక్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే.. పంట పొలాల్లో సైనిక విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుంది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదమని… కారణాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates