అల్టిమేటం ఇచ్చారు : 11 నుంచి ఆర్టీసీ సమ్మె

rtc
RTC గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ సమ్మె కు సిద్ధమైంది.  ఈనెల 10వ తేదీలోపు వేతన సవరణ అమలుతోపాటు, కార్మికుల సమస్యలు పరిష్కరిచాలని అల్టిమేటం ఇచ్చింది. లేనిపక్షంలో జూన్ 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. గత నెల మే 7న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు కార్మిక సంఘం నేతలు. ఫస్ట్ ఏప్రిల్ 2017 నుంచి వేతన సవరణ కావాలని కోరుతున్నాయి సంఘాలు. జూన్ 7 నుంచి నిరసనలు కూడా తెలపాలని నిర్ణయించారు. ఇప్పటికే పలుసార్లు కార్మిక సంఘాలతో చర్చించిన మంత్రుల కమిటీ.. డిమాండ్లపై చర్చించాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడాలంటే.. కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని.. ఓపిక పట్టాలని ప్రభుత్వం కోరింది.

వేతన సవరణపై పట్టుబట్టిన తెలంగాణ మజ్దూర్ యూనియన్.. డిమాండ్ నెరవేర్చాలని పట్టుబడుతుంది. ప్రభుత్వం నుంచి హామీ లభించకపోవటంతో.. జూన్ 11వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన చేశారు కార్మిక సంఘం నేతలు. సమ్మె సన్నాహాకాల్లో భాగంగా జూన్ 7న అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట భోజన విరామంలో ఎర్ర బ్యాడ్జీలతో నిరసనలు తెలియజేయనున్నారు. జూన్ 8న రీజినల్ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలకు దిగుతారు.

Posted in Uncategorized

Latest Updates