అవకాశాలు ఇస్తూనే ఉన్నారు : రాష్ట్రవ్యాప్తంగా LRS గడువు పెంపు

lrs

LRS (లే ఔట్ క్రమబద్దీకరణ స్కీమ్) అవకాశాన్ని మరోసారి కల్పించింది ప్రభుత్వం. మరో రెండు నెలలు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. GHMC, HMDA, కుడా (కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ), డీటీసీపీ, పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో పెండింగ్ లో ఉన్న LRS ఫైళ్లకు మోక్షం లభించనున్నది. ప్రస్తుతం ఏయే ఫైళ్లను పరిష్కరిస్తామనే విషయంలో మున్సిపాలిటీ కొంత స్పష్టతను కూడా ఇచ్చింది ప్రభుత్వం.

కలెక్టర్ లేదా నీటిపారుదలశాఖ నుంచి NOC పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, స్థల వినియోగ మార్పిడి పేపర్ అందుకోని దరఖాస్తులను మే 31 తేదీలోపు పరిష్కరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, స్థానిక సంస్థల దగ్గర పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, నగరాలు, పట్టణాల విస్తరణ కారణంగా స్థానిక సంస్థ నుంచి మున్సిపాలిటీలకు బదిలీ అయిన దరఖాస్తులను కూడా ఈసారి పరిష్కరించనున్నారు. ఇలాంటి ఫైళ్లన్నింటికీ మోక్షం లభించనుంది. LRS ఫైళ్లను పరిష్కరించే అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం.   సమస్యలను పరిష్కరించకుండా, ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Posted in Uncategorized

Latest Updates