అవతరణ దినోత్సవం : పరేడ్ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

Telangana-Formation-Day-Celebrations-696x435తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సం వేడుకల సందర్భంగా శనివారం (జూన్-2) పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్ళింపులు, అంక్షలను విధించారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వచ్చే ప్రజలు, VIP లకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను చేశారు. ఈ ఆంక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ఉంటాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.


దారి మళ్ళింపులు ఇలా…

– ఎబీహెచ్ నుంచి వచ్చే వాహనాలను బేగంపేట్ వైపు అనుమతించరు. ఆ వాహనాలను ప్యాట్నీ, ఆర్‌పీ రోడ్డు, ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ రోడ్డు వయా ఎస్‌డీ రోడ్డు, స్వీకార్ ఉపకార్ టీవోలీ బాలంరాయి, సీటీఓ మీదుగా బేగంపేట్ వైపు మళ్ళిస్తారు.
– సీటీఓ నుంచి పరేడ్ గ్రౌండ్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఆ వాహనాలను బాలాంరాయి, తాడ్‌బండ్, మస్తాన్ కేష్, బ్రూక్ బాండ్, టివోలీ, స్వీకార్, ఉప్‌కార్, ప్యాడైజ్, ఎస్‌డీ రోడ్డు, ప్యాట్నీ, క్లాక్ టవర్, సంగీత్ జంక్షన్ వైపు మళ్ళిస్తారు.
– టివోలీ నుంచి ప్లాజా వైపు వెళ్ళే వాహనాలను బాలంరాయి, సీటీఓ, వైఎంసీఏ వైపు మళ్ళిస్తారు.
-ప్యారడైజ్ నుంచి ప్లాజా వైపు వెళ్ళే వాహనాలు ప్యారడైజ్ ప్యాట్నీ వైపు పంపిస్తారు.
– వైఎంసీఏ, సీటీఓ వద్ద ఉన్న ైఫ్లెఓవర్‌లపై వాహనాల రాకపోకలకు అనుమతి లేదు.
– ఈ వేడుకలకు వచ్చే సాధారణ ప్రజల వాహనాలకు లంబా ధియేటర్ మార్గంలో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
ఈ మళ్ళింపులను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు.

Posted in Uncategorized

Latest Updates