అవతరణ దినోత్సవ కానుక : పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల

policeనిరుద్యోగులకు తీపికబురు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. భారీగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 16వేల 767 కానిస్టేబుల్ పోస్టులు, 168 ఫైర్ మెన్, 221వార్డెన్స్, 739 ఎస్సైలు, 26 ఎఎస్సైలు, 471 ఆర్ఎస్సైఐ, 90 ఫైర్ ఆఫీసర్, 15 డిప్యూటీ జైలర్, 2 అసిస్టెంట్ మ్యాటన్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 18వేల 428 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విడుదలైన అతిపెద్ద నోటిఫికేషన్ ఇదే.

జూన్ 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18వేల 428 ఉద్యోగాలను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండటంతో.. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తోంది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి.. అందరికీ పోస్టింగ్స్ ఇచ్చేయాలని నిర్ణయించింది.

Posted in Uncategorized

Latest Updates