అవమానించారు : ప్రియా వారియర్ పై కేసు

PRIYAA

నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో అ అమ్మాయి టాప్ ట్రెండింగ్. కొంటె చూపులతో కుర్రకారు మనసులను దోచేసింది. తనే ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. కేరళకు చెందిన ఈ అమ్మడు ఒక్క టీజర్‌తోనే వార్తల్లో నిలిచింది. తన కనుసైగలతో యువతను కట్టిపడేసింది. కోట్ల మంది యువతీ యువకులు ఈ వీడియోను తమ వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నారు. ఈ బ్యూటీపై హైదరాబాద్‌లో బుధవారం (ఫిబ్రవరి-14) పోలీస్‌ కేసు నమోదైంది.

ఫరూక్‌ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట షూట్ చేశారని.. సినిమా నిర్మాత, దర్శకులపై చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు పోలీసులు. ఒరు ఆదార్‌ లవ్‌ అనే ఈ మలయాళ సినిమా పాటలో ఓ ముస్లిం అమ్మాయి.. తమ మత ఆచారాలకు విరుద్ధంగా ప్రవర్తించింది అనేది వీరి ఆరోపణలు. ఆ సాంగ్ లో పదాలు కూడా ముస్లిం మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని కంప్లయింట్ లో తెలిపారు. ఆ పదాలన్నీ తమ మతాన్ని అవమానిస్తున్నాయని అబ్దుల్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ కంప్లయింట్ నమోదు అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates