అవసరాన్ని బట్టి చంద్రబాబు మారిపోతుంటారు : ఎంపీ జేసీ

అధికారంలోకి  రాకముందు  ప్రత్యేక హోదా పాటపాడిన  బీజేపీ.. తర్వాత  ఆ విషయాన్నే మరిచిపోయిందన్నారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. చంద్రబాబు చాలా చతురత కలిగిన  వ్యక్తి  అన్నారు. చంద్రబాబుకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసన్నారు. చంద్రబాబుకు కాళ్లు  పట్టుకోవడం  తెలుసు, జుట్టు పట్టుకోవడం తెలుసన్నారు ఎంపీ జేసీ దివాకరరెడ్డి. కియా మోటర్స్ ను ఏపీకి  తీసుకురావడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారన్నారు. అనంతపురంలో కరువు  నేలపై  కేంద్ర వివక్ష పేరుతో  చేస్తున్న దీక్షలో  పాల్గొన్నారు  జేసీ.

తన నోటి దురుసుతో అనేకసార్లు బహిరంగంగానే సొంత పార్టీనే ఇరుకున పెట్టేలా జేసీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న దీక్షలో పాల్గొని సీఎం రమేష్ కు సంఘీభావం ప్రకటిస్తూనే.. అసలు దీక్షలు చేస్తే ఉక్కు కాదు కదా తుక్కు కూడా రాదని దీక్షా వేదికపైనే వ్యాఖ్యలు చేశారు.ఆ తర్వాత చంద్రబాబు సమక్షంలోనే పోలవరం ఇప్పట్లో పూర్తి కాదని.. ఆ విషయం సీఎంకి కూడా తెలుసు అని సంచలన కామెంట్స్ చేశారు. ఇలా తరచూ టీడీపీ దృష్టిలో వివాదాస్పదంగా కనిపించే వాస్తవాలను చెబుతూ సొంతపార్టీ నేతల ఆగ్రహానికే గురవుతుంటారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అదే తరహాలో ఇప్పుడు చంద్రబాబు వ్యక్తిత్వంపై కామెంట్స్ చేసి మరోసారి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు.

Posted in Uncategorized

Latest Updates