అవార్డును తిరస్కరించిన ఐపీఎస్ అధికారిణి

roopaఅన్నాడిఎంకె బహిష్కృత నేత శశికళ రాజభోగాలను వెలుగులోకి తెచ్చిన IPS అధికారిణి రూపను నమ్మ పౌండేషన్ ప్రతి ఏటా ఇచ్చే ఉత్తమ అధికారి జాబితా కింద అవార్డుకు ఎంపిక చేశారు. అయితే ఈ అవార్డును మాత్రం ఆమె అంగీకరించలేదు.ఈ అవార్డును తీసుకోవడానికి తన మనస్సు అంగీకరించడం లేదని ఆమె నమ్మ పౌండేషన్‌కు లేఖ రాశారు. అన్నాడిఎంకె బహిష్కృత నేత కర్ణాటక రాష్ట్రంలోని పరప్పర ఆగ్రహర జైలులో రాజభోగాలను అనుభవించారు. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారిణి రూప బట్టబయలు చేశారు. తీవ్ర ఒత్తిళ్ళు ఎదురైనా ఆమె ఈ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు.

బెంగళూరుకు చెందిన నమ్మ పౌండేషన్ ప్రతి ఏటా 5 రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందిస్తోంది. అయితే అందులో ఉత్తమ ప్రభుత్వ అధికారి కేటగరి కింద 8 మంది అధికారుల లిస్టును తయారు చేసింది. ఈ జాబితాలో ఐపీఎస్ అధికారిణి రూప పేరు కూడా ఉంది. అయితే ఆ ఆలిస్టు నుంచి తన పేరును తొలగించాలని ఐపీఎస్ అధికారిణి రూప కోరారు. ఈ మేరకు నమ్మ పౌండేషన్ సీఈఓ ఎణ్బీఎఫ్ శ్రీధర్‌కు ఆమె లేఖ రాశారు. అయితే ఈ అవార్డును స్వీకరించేందుకు తన మనస్సు అంగీకరించడం లేదన్నారు. ఈ అవార్డుకు తన పేరును ఎంపిక చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు, రాజకీయ అనుబంధ సంస్థలకు ప్రభుత్వాధికారులు వీలైనంత దూరంగా ఉండాలి. అప్పడే అధికారులపై ప్రజలకు మంచి పేరు ఉంటుందని ఆమె ఆ లేఖలో తెలిపారు. నమ్మ పౌండేషన్ చైర్మెన్ రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా విజయం సాధించారు.

Posted in Uncategorized

Latest Updates