అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్ : దత్తాత్రేయ

ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. రాఫెల్‌ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలను దత్తాత్రేయ ఖండించారు. ఆదివారం (జూలై-29) హైదరాబాద్‌ లోని BJP కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేసేందుకే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ను ప్రజలు శిక్షించినా ఇంకా గుణపాఠం నేర్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రాహుల్ మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీయేనన్నారు దత్తాత్రేయ.

Posted in Uncategorized

Latest Updates