అవినీతి ఆరోపణలతో హుజూర్ నగర్ సీఐ సస్పెండ్

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సీఐ నరసింహ్మా రెడ్డి సస్పెండయ్యారు. ఇసుక అక్రమ రవాణా, గుట్కా, PSD రైస్ అక్రమ దందాలాంటివాటిలో సీఐ నరసింహారెడ్డిపై అభియోగాలున్నాయి. సీఐ నరసింహారెడ్డితో పాటు కానిస్టేబుళ్లు బలరాం రెడ్డి, వెంకటేశ్వర్లు, కమలాకర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఐజీ స్టీఫెన్ రవీంద్ర. అక్రమ వసూళ్లు, రేషన్ బియ్యం, గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణాకు సహకరిస్తూ పెద్ద ఎత్తున వసూళ్లు చేశారన్న ఆరోపణలున్నాయి.

హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఇంఛార్జ్ శంకరమ్మ విషయంలోనూ నరసింహారెడ్డి వ్యవహారం వివాదస్పదమైంది. సీఐ, కానిస్టేబుళ్ల వ్యవహారంపై ఇంటలిజెన్స్ నివేదిక తెప్పించుకున్న ఐజీ స్టీఫెన్ రవీంద్ర.. వాళ్లను సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలు వస్తే సహించేది లేదని ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ పేరుతో వేధింపులకు పాల్పడితే ఇలాంటి చర్యలే ఉంటాయని స్పష్టం చేశారు. పోలీసులు వసూళ్లకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని కూడా కోరుతున్నారు ఉన్నతాధికారులు.

Posted in Uncategorized

Latest Updates