అవినీతి చేయదు, లంచం అడగదు : రోబోలతోనే పరిపాలన అందిస్తాం

roboసాధారంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమను గెలిపిస్తే మీకు రోడ్లు వేయిస్తాం, వివిధ రకాల సంక్షేమ పధకాలు అందిస్తాం, అంటూ వాగాద్దానాలు చేయడం మనం ప్రతి చోటా చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం తాను గెలిస్తే పాలన మొత్తం రోబోలతో చేసేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
జపాన్‌ లోని టోక్యో జిల్లాలోని టామా సిటీకి మేయర్‌ స్థానం కోసం ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. మేయర్ కుర్చీ కోసం చాలా మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. ఎవరి స్టైల్ లో వారు ప్రచారం చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. అయితే మిచిటో మస్తుడా అనే ఓ అభ్యర్థి మాత్రం ఎవరూ ఊహించని రీతిలో హామీలు ఇస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నాడు. తనను గెలిపిస్తే.. పరిపాలన మొత్తం రోబోలతో చేసేస్తానని హామీ ఇచ్చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి కృత్రిమ మేధతో నడిచే రోబోలను నియమిస్తానని, దీంతో అవినీతి, లంచం అనే మాట తన పరిపాలనలో ఉండదని చెబుతున్నాడు. ఈ విధానం ద్వారా నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోవచ్చని, తద్వారా ప్రజలకు త్వరితగతిన మొరుగైన సేవలందించవచ్చని చెబుతున్నాడు. ఈ రోజు (ఏప్రిల్‌ 15) జరుగుతున్న ఈ ఎన్నికల్లో మిచిటో గెలిస్తే కృత్రిమ మేధస్సుతో పనిచేసే మొట్టమొదటి మేయర్‌ గా రికార్డు సృష్టించనున్నాడు.

Posted in Uncategorized

Latest Updates