అవిశ్వాసంపై చర్చకు TRS రెడీ : రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటున్న ఎంపీలు

అవిశ్వాసంపై చర్చకు రెడీ అయ్యారు టీఆర్ఎస్ ఎంపీలు. ఢిల్లీలో ఎంపీ  జితేందర్ రెడ్డి నివాసంలో టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. పార్లమెంటులో జరగబోయే అవిశ్వాస తీర్మానం సందర్భంగా తీసుకోవాల్సిన స్టాండ్ పై టీఆర్ఎస్ ఎంపీలు చర్చించారు. లోక్ సభ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వినోద్ తో ఫోన్లో మాట్లాడి సూచనలు చేశారు సీఎం కేసీఆర్.

ఏపీకి  కేంద్రం  90శాతం  నిధులిస్తే  అభ్యంతరం  లేదన్నారు ఎంపీ వినోద్. అక్కడి  పరిశ్రమలకు  ఇన్సెంటివ్ ఇస్తే తాము వ్యతిరేకిస్తామన్నారు.  ఏపీకి  ఎలాంటి  ప్రత్యేక హోదా  ఇస్తారన్న  విషయంపై  రాహుల్ ను ప్రశ్నిస్తామన్నారు  వినోద్. ఫస్ట్  కెబినేట్  మీటింగ్ లోనే  తెలంగాణకు  అన్యాయం  జరిగిందన్నారు. గత సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలకు మద్దతు పలికారు టీఆర్ఎస్ ఎంపీలు.  ఈ మధ్యకాలంలోనే తెలంగాణ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. అదీగాక విభజన హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని డిమాడ్ చేస్తున్నారు చంద్రబాబు.  హైకోర్టు విభజన విషయంలో మాత్రం బాబు కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. తమకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates