అవిశ్వాసం : రాజీనామాలు చేసిన చైర్మన్, మేయర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ సునీతరాణిపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షణలో జరిగిన బలపరీక్షలో…34 మంది కౌన్సిలర్లకు గానూ..32 మంది కౌన్సిలర్లు… చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.

దీంతో సునీతరాణి పదవి కోల్పోయారు. అయితే అవిశ్వాసంలో నెగ్గనని తెలిసి ముందుగానే జిల్లా కలెక్టర్ కు రాజీనామా సమర్పించారు సునీతరాణి. అది ఆమోదం పొందకపోవడంతో గురువారం(ఆగస్టు-2) అవిశ్వాస ప్రక్రియను నిర్వహించారు. త్వరలోనే కొత్త చైర్మన్ ఎన్నిక జరుగుతుందన్నారు నేతలు.

Posted in Uncategorized

Latest Updates