అవిశ్వాస తీర్మానం : భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఓటమి

అవిశ్వాస తీర్మానంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ లావణ్య ఓడిపోయారు. తీర్మాణంపై మంగళవారం (జూలై-24) జరిగిన ఓటింగ్ లో 22 మంది కౌన్సిలర్లు చైర్మన్ కు వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం 30 మంది సభ్యులుండగా… ఇందులో 22మంది చైర్మన్ కు వ్యతిరేకంగా ఉండడంతో లావణ్యకు ఓటమి తప్పలేదు. అవిశ్వాసం సందర్భంగా పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అటు అవిశ్వాసంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి తీరుకు నిరసనగా మున్సిపల్ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి ఎంపీపీపై పెట్టిన అవిశ్వాస చర్చ ఉత్కంఠగా సాగింది. జిల్లాలో మొత్తం పదిమంది ఎంపీటీసీలు ఉండగా…అందులో  ఏడుగురు ఎంపీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. భారీ బందోబస్తు నడుమ నిర్వహించిన ఓటింగ్ లో…ఎంపీపీ గురిజెల రాజు తన బలాన్ని నిరూపించుకోలేక పోయింది.  దీంతో ఆరపేట ఎంపీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Posted in Uncategorized

Latest Updates