అవి ఆస్పత్రులేనా : తల్లి ఆక్సిజన్ సిలిండర్ భుజాలపై మోస్తూ..

oldఅంబులెన్స్ రాక కోసం ఎదురుచూసి.. ఎంతకీ రాకపోవడంతో స్ట్రెచర్‌ లేకుండానే ఆస్పత్రి ఆవరణలో ఓ కొడుకు తన తల్లికి పెట్టిన ఆక్సిజన్‌ సిలిండర్‌ను భుజాన వేసుకుంటూ వెళ్లాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఆగ్రా మెడికల్‌ కాలేజీలో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

అంగురాదేవి అనే మహిళ అనారోగ్యానికి గురైంది. ఆమెను ఏప్రిల్ 5వ తేదీ గురువారం ఆగ్రా మెడికల్ కాలేజీలో చేర్పించాడు కుమారుడు. ఊపిరి సరిగా పీల్చుకోలేకపోవడంతో ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. తర్వాత ట్రీట్ మెంట్ కోసం అంగురాదేవిని మరో భవనంలోకి వెళ్లాలని సూచించారు. అయితే అక్కడికి వెళ్లటానికి స్ట్రక్చర్, వీల్ చైర్ కానీ అందుబాటులో లేవు. అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. అది కూడా లేదు. ఎంతకీ ఏవీ అందుబాటులోకి రాకపోవటంతో.. ఆమె కుమారుడే ఆక్సిజన్‌ సిలిండర్‌ను భుజాన వేసుకుని.. తల్లిని నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. పేషెంట్ ముఖానికి ఆక్సిజన్‌ మాస్క్‌ ఉండగా, కొడుకు భుజాన సిలిండర్‌ ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇవి ఆస్పత్రులేనా అని నిలదీస్తున్నారు. ప్రజల నుంచి నిరసనలు రావటంతో.. విచారణ జరిపిస్తామని తెలిపింది ఆస్పత్రి మేనేజ్ మెంట్.

Posted in Uncategorized

Latest Updates