అవి తప్పుడు లెక్కలు : స్విస్ బ్యాంకుల్లో 80శాతం డబ్బు తగ్గింది

వారం, 10 రోజుల క్రితం ఓ వార్త.. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నగదు నిల్వలు పెరిగాయి అని.. కానీ అదంతా తప్పు అని వివరణ ఇచ్చారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. రాజ్యసభలో సమాధానం చెప్పారు. ఆ నివేదిక తప్పు అని వెల్లడించారు. వాస్తవంగా 80శాతం భారతీయుల డబ్బు తగ్గిపోయినట్లు ప్రకటించారు. 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. స్విస్ బ్యాంకుల్లో ఇండియన్స్ డిపాజిట్లు తగ్గాయన్నారు. అది 80శాతంగా ఉందన్నారు. 2016తో పోల్చితే 2017లో 35శాతం తగ్గినట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ నివేదిక ఇదే చెబుతుంది అని వివరించారు.

గత నెలలో వచ్చిన నివేదిక అయితే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు 50శాతం పెరిగినట్లు వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం రాజ్యసభలో వివరణ ఇచ్చింది. ఆ నివేదిక తప్పుని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates