అవ‌స‌ర‌మైతే మ‌రోసారి పాక్‌పై స‌ర్జిక‌ల్ దాడులు: హుడా

hooodaపాకిస్తాన్ కు మరోసారి గట్టి మెసేజ్ ఇవ్వాలని ఇండియా అనుకుంటే మళ్లీ వారిపై సర్జికల్ దాడులకు వెనుకాడబోయేది లేదని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డి.హెస్ హుడా అన్నారు. 2016 లో ఉగ్ర శిబిరాలపై సర్జికల్ దాడులు హుడా పర్యవేక్షణలో జరిగాయి. శుక్రవారం(జూన్-29) హుడా మాట్లాడుతూ 2016లో ఉగ్రశిబిరాలపై దాడులు జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని…దీనికి సైన్యం అంగీకరించిందన్నారు. అంతిమంగా నిర్ణయం రాజకీయ నాయకత్వం నుంచే వచ్చిందని… పాక్ కు మరోసారి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని ఇండియా కోరుకుంటే తప్పనిసరిగా ఆర్మీ ఆ పని చేస్తుందన్నారు హూడా.

Posted in Uncategorized

Latest Updates