అసిఫా కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

asiకశ్మీర్‌ లో 8 ఏళ్ల చిన్నారి అసిఫా అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ రోజు(ఏప్రిల్-13) సుప్రీం కోర్టు ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది. దీని గురించి వాస్తవాలను అందజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం న్యాయవాదులను ఆదేశించింది. కథువా, జమ్మూ కశ్మీర్ న్యాయవాదులకు లేఖ రాసిన సుప్రీంకోర్టు… అత్యాచారానికి పాల్పడిన నిందితులపై ఛార్జ్‌ షీటు ఫైల్ చేయకుండా అడ్డుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారి కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడిన న్యాయవాదులు, నిందితులపై ఛార్జ్‌ షీట్ దాఖలు చేయకుండా ఎందుకు అడ్డుకున్నారో తెలిపాలని కోరింది. ధర్మాసనం వ్యాఖ్యలపై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయవాదులు వాస్తవాలను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. కథువా జిల్లాలో జనవరి 10న ఇంటి ఆవరణలో గుర్రాలకు మేత వేస్తున్న 8 ఏళ్ల చిన్నారి ఆసీఫాను ఎనిమిది దుండగులు కిడ్నాప్ చేసి వారం రోజుల పాటు అన్నం పెట్టకుండా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates