అసెంబ్లీకి కాంగ్రెసోళ్లు పీకనీకి వచ్చిన్రా… కేసీఆర్ నిప్పులు

వనపర్తి : నాగవరం ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్రమైన విమర్శలు చేశారు కేసీఆర్. పారిపోవుడే కాంగ్రెస్ నాయకుల పని అని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టు రీడిజైన్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే.. కాంగ్రెస్ నేతలు పారిపోయారని అన్నారు. ఏదడిగినా కాంగ్రెసోళ్లు పారిపోతారని విమర్శించారు.

“అసెంబ్లీ నుంచి ప్రజలకు ప్రాజెక్టులపై వివరిస్తే.. కాంగ్రెస్ నేతలు వెన్ను చూపించి పారిపోయారు. మీకు ముఖం లేకనా.. తెలివి లేకనా.. అవగాహన లేకనా… ఎందుకు పారిపోయారు. సమాధానంచెప్పాలి. ఆంధ్రా పాలకులకు సంచులు మోసి బతికినారు. తెలంగాణ సోయి మీకెక్కడిది. ప్రతిసారి పారిపోవాలె.. అసెంబ్లీ పెడితే సస్పెండ్ కావాలె. అదీ వాళ్లలెక్క. ఏదైనా అడిగితే… ఉత్తమ్ .. ప్రిపేర్ అయి రాలే అంటడు. మరి పీకనీకి వచ్చిన్రా.. గోలీలాడుతామని వచ్చినారా.. ఏ నదృ, ఏ ప్రాజెక్టు ఎక్కడుందో తెల్వదు.. తెలంగాణ గురించి కనీసం జ్ఞానం లేదు” అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates