అసెంబ్లీలో కేసీఆరే సీనియర్ ఎమ్మెల్యే.. మరి ప్రొటెం స్పీకర్ ఎవరు..?

తెలంగాణ భవన్ లో లంచ్ సమయంలో మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిట్ చాట్ చేశారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. సాధారణంగా.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు… అసెంబ్లీని సమావేశపరుస్తారు. అసెంబ్లీని ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు. సభలోని సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారు. మరికొన్ని నిబంధనలతోనూ ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకుంటుంటారు. ఐతే… ఈసారి అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్ కేసీఆరే. చిట్ చాట్ లో ఈ విషయాన్ని కేసీఆరే చెప్పారు. కేసీఆర్ తర్వాత… అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ల లిస్టులో ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్యానాయక్ ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకునే చాన్స్ ఉంది.

Posted in Uncategorized

Latest Updates