అసెంబ్లీ నిరవధిక వాయిదా

Legislative_Assemblyతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. గురువారం (మార్చి-29) తెలంగాణ పంచాయతీరాజ్, పురపాలక బిల్లులను ఆమోదించిన అనంతరం స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 13 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 60 గంటల 58 నిమిషాల పాటు సభ కొనసాగినట్లు తెలిపారు స్పీకర్. ఈ సందర్భంగా మొత్తం 11 బిల్లులను సభ ఆమోదం తెలిపింది.

ఈ శాసనసభ సమావేశాలు ఓ ప్రత్యేక చాటుకున్నాయి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నది సభ. కీలకమైన ప్రైవేట్ యూనివర్శిటీలు, పంచాయతీ రాజ్ కొత్త చట్టానికి అసెంబ్లీ ఆమోదించింది.

Posted in Uncategorized

Latest Updates