అసెంబ్లీ రద్దుపై పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్ :  రాష్ట్ర అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పూర్తి కాలానికంటే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ మాజీమంత్రి, కాంగ్రెస్‌ నేత డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, లాయర్ శశాంక్‌రెడ్డి హైకోర్టులో కొద్దిరోజుల కింద… వేర్వేరుగా పిటిషన్లు వేశారు. అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వలేదని డీకే అరుణ తన పిటిషన్ లో కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ల వాదనల్లో పసలేదని… రాజ్యాంగ సూత్రాల ప్రకారం రద్దు నిర్ణయం సరైనదేనని భావించిన ధర్మాసనం… అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ నేరుగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.

Posted in Uncategorized

Latest Updates