అసోంలో రైలు ఢీకొని 4 ఏనుగులు మృతి

helఅత్యంత భాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది అసోంలో. రైలు ప్రమాదాల నుంచి ఏనుగులను రక్షించడానికి రైల్వే శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఓ ప్యాసింజర్ రైలు ఢీ కొట్టిన ఘటనలో ఏనుగులు చనిపోయాయి. భాధాకరమైన ఈ ఘటన జంతుప్రేమికుల హదయాలను కలచివేస్తుంది.

శనివారం(ఫిబ్రవరి10) రాత్రి 9.30 గంటల సమయంలో హబైపుర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో గువాహటి- సిల్చార్‌ ప్యాసింజర్‌ రైలు ఐదు ఏనుగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 ఏనుగులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఏనుగుకు తీవ్రగాయాలయ్యాయి. ఏనుగులను వేగంగా ఢీకొట్టడంతో రైలు కుదుపునకు గురైంది. దీంతో రైలు ఇంజిన్‌ బోగీలనుంచి విడిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి రైల్లో ఉన్న వందలాది ప్రయాణికులు భయాందోళలనలకు గురయ్యారు.

Posted in Uncategorized

Latest Updates