అసోం NRC లిస్ట్….బెంగాలీ, బీహారీలను గెంటివేయడానికే : మమతా

అసోంలో స్థానికులు – స్థానికేతరులను గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (NRC)  విడుదల చేసిన ముసాయిదాపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఫైర్ అయ్యారు. అసోం ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాలో  40 లక్షల మందికి పౌరసత్వం లభించకపోవడాన్ని… బీజేపీ గేమ్ ప్లాన్ గా మమత వర్ణించారు. ఇది కేవలం బీజేపీ ఓటు రాజకీయాల్లో భాగమేనని మమత అన్నారు. పౌరసత్వం లభించని 40 లక్షలమంది కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైనా పునరావాస పథకం ఉందా అంటూ మమత ప్రశ్నించారు. అంతిమంగా బెంగాల్ కే నష్టం జరుగుతుందని మమత అన్నారు. అసోం నుంచి బీహారీలు, బెంగాలీ మాట్లాడే ప్రజలను గెంటివేయడానికే ఈ ప్లాన్ అని మమత అన్నారు. ఆధార్ కార్డు, పాస్ పోర్టులు ఉన్నప్పటికీ ముసాయిదా లిస్ట్ లో లేవని వారి పేర్లు లేవని మమత తెలిపారు. తమ సొంతదేశంలోనే ప్రజలు శరణార్ధులుగా మార్చబడ్డారని మమత అన్నారు.ఈ పరిణామాల ప్రభావం వెస్ట్ బెంగాల్ పైనే పడుతుందని మమత తెలిపారు. వెంటనే జాబితాకు సవరణ చేయాలని హోం మంత్రిని కోరినట్లు మమత తెలిపారు. తమ పార్టీ ఎంపీలు ఇప్పటికే అసోం బయలుదేరారని, తాను కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు మమత తెలిపారు. అసోం NRC జాబితాపై స్పందించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్…. జాబితాలో పేర్లు లేనివారిపై ఎలాంటి నిర్బంధ చర్యలు ఉండవని హామీ ఇచ్చారు.

కట్టుదిట్టమైన భద్రత నడుమ NRC లిస్టును సోమవారం (జూలై-30) ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉండే NRC సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు అసోం అధికారులు. పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాల నుంచి వలసలు కొనసాగడంతోనే పౌరసత్వ జాబితాను రూపొందించాల్సి వచ్చిందన్నారు.

Posted in Uncategorized

Latest Updates