అస్సలు తగ్గలేదుగా : పోలీసులతో మందుబాబు ఫైటింగ్

Drunken-Driveకిక్ బాగా ఎక్కింది. ఈ టైంలో పోలీస్ అయితే ఏంటీ.. ఇంకెవరు అయితే ఏంటీ.. ఎవరైనా ఒకటే. ఇలాంటి సీన్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో జరిగింది. బాగా తాగి.. కిక్ లో ఉన్న కుర్రోడు కారులో వచ్చాడు. బ్రీత్ అనలైజర్ పెట్టారు. డోంట్ కేర్ అన్నారు. టెస్ట్ కు సహకరించేది లేదని తెగేసి చెప్పాడు. వాడికే అంత ఉంటే.. ఇక పోలీసులకు ఎంత ఉండాలి. కారు దింపారు. రోడ్డుపై నిలబెట్టారు. అంతే చిర్రెత్తిపోయాడు మందుబాబు.. పోలీసులపై తిరగబడ్డాడు. చేయి చేసుకున్నాడు. అతన్ని కంట్రోల్ చేయటానికి పోలీసులు కూడా నాలుగు తగిలించారు. కింద పడ్డాడు. కాళ్లతో నాలుగు తన్నులు తన్నారు పోలీసులు. లేచిన తర్వాత కూడా తగ్గలేదు కిక్ లోని కుర్రోడు. మళ్లీ పోలీసులపై చేయి చేసుకున్నాడు.

డ్రంకన్  డ్రైవ్ లో  పట్టుబడ్డ  ఓ యువకుడు  పోలీసులపై  హల్ చల్  చేశాడు. సరైన  పత్రాల్లేకుండా… బ్రీత్ అనలైజర్  టెస్టుకు సహకరించక..  ముప్పుతిప్పలు  పెట్టాడు. పైగా పోలీసులపై  చేయి చేసుకున్నాడు. దీంతో  పోలీసులూ  అతనికి  కోటింగ్ ఇచ్చారు.  రాత్రి జూబ్లీహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్  టెస్ట్ చేసిన  పోలీసులు.. అంకిత్  అనే యువకుడ్ని అరెస్ట్ చేశారు. పోలీసులపై దాడి  చేసినందుకు ఐపీసీ 353 సెక్షన్  కింద కేసు నమోదు  చేశారు. సిటీలో  వివిధ ప్రాంతాల్లో  డ్రంక్ అండ్ డ్రైవ్  టెస్టులు చేపట్టారు పోలీసులు. 85 కేసులు నమోదు చేశారు.

Posted in Uncategorized

Latest Updates