అస్సాంలో భారీ బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ

అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన బోగిబీల్‌ వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇవాళ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఈ వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి 5 వేల 920 కోట్ల రూపాయిలు ఖర్చయ్యాయి. 1997 జనవరి 22న అప్పటి ప్రధాని హెచ్‌డి దేవెగౌడ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వర్గీయ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఇది దేశంలోనే అతిపెద్ద రైలు కమ్ రోడ్డు బ్రిడ్జి. 4.94 కిలో మీటర్ల పొడవున్న…బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి 21 ఏళ్ళు పట్టింది.

అస్సాంలోని దిబ్యదిబ్రూగఢ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని ధిమాజి జిల్లాల మధ్య నిర్మించిన ఈ వంతనతో దాదాపు 10 గంటల సయమం ఆదా అవుతుంది. ఈశాన్య సరిహద్దుకు రక్షణ సామగ్రిని ఎగుమతి చేసేందుకు అత్యంత భారీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. వంతెన కింది భాగంలో రెండు లైన్ల రైలు పట్టాలు…పై భాగంలో మూడు లైన్ల రోడ్లున్నాయి.

Posted in Uncategorized

Latest Updates