అహ్మదాబాద్ ఇస్రో సెంటర్ లో ఫైర్ యాక్సిడెంట్

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) సెంటర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. స్టేషనరీ మెటీరియల్ ను ఉంచిన స్టోర్  రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఇదే ఇస్రో కేంద్రంలోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో ఈ ఏడాది మే నెలలోనూ అగ్ని ప్రమాదం జరిగింది.

Posted in Uncategorized

Latest Updates