‘ఆంగ్రోబిక్స్’ తో ఆరోగ్యంగా ఉంటారు

ఫిజికల్ ఫిట్‌ నెస్‌ తోపాటు మైండ్ ఫిట్‌ నెస్‌ ఎంతో ముఖ్యం. ట్రెడ్‌ మిల్‌ వ్యాయామాలు, జిమ్‌ లో వర్కవుట్‌ లేకుండా’ ఆంగ్రోబిక్స్‌’  అనే కొత్త రకం వ్యాయామం చేస్తే మానసికంగా కూడా ఫిట్‌ గా ఉంటారు. కోపం, ఉద్రేకం తగ్గుతాయట.’ ఆంగ్రోబిక్స్’లో  భాగంగా బాక్సింగ్‌ చేస్తారు. బాక్సింగ్‌ ప్యాడ్స్  మీద పంచ్‌ లు విసురుతూ ప్రాక్టీస్‌ చేస్తే ఒత్తిడి పెంచే ఆలోచనల్ని, బాధను, కోపాన్ని దూరం చేసుకోవచ్చు.

వెయిట్‌ లిఫ్టింగ్‌ వల్ల హెల్దీ బాడీతో పాటు మానసిక ఆహ్లాదం కూడా లభిస్తుంది.టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ విడుదల పెరుగుతుంది. రోజుకు 20నిమిషాలు బరువులు ఎత్తడం వల్ల ఉద్రేకం తగ్గి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రబ్బర్‌ మెడిసిన్‌ బాల్స్‌ తో కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. గోడకు కొంచెం దూరంగా నిలబడి బంతిని విసిరాలి. ఆ బంతిని క్యాచ్‌ పట్టాలి . ఇలా కొద్దిసేపు చేయాలి. పాటలు వింటూ, డ్యాన్స్ చేస్తే శరీరానికి చాలా వ్యాయామం. మనసుకు నచ్చిన పాటలు విం టూ, కాళ్లు కదిపితే శరీరం, మనసు రెండూ ఫిట్‌ గా  ఉంటాయి.

Posted in Uncategorized

Latest Updates