ఆంజనేయస్వామి గుడిని పునరుద్ధరించిన ముస్లిం వ్యక్తి

musరాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు   నమ్మకాలని బట్టి ప్రజలను ఇష్టపడుతుంటారు. అయినా ఇప్పటికీ  భారత్ ప్రజాస్వామ్య… సెక్యులర్ దేశమని ప్రపంచమంతా నమ్ముతుంది.

సాధారణంగా  హిందువుల గుడిలోకి ముస్లింలు ప్రవేశించరు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఇప్పటికీ మత ఘర్షణలు ఏదో ఒక మూలన జరగుతూనే ఉన్నాయి. అలాంటిది  అహ్మదాబాద్ కు చెందిన ఓ ముస్లిం బిల్డర్ మీమాన్ 500 ఏళ్ల నాటి ఆంజనేయస్వామి ఆలయానికి ఆయనే స్వయంగా మరమ్మతులు చేస్తున్నాడు. 43ఏళ్ల  ఈ బిల్డర్ చిన్న నాటి నుండి ఆంజనేయస్పామిని విపరీతంగా ఇష్టపడేవాడు.తన పేరు కూడా బిద్ బెహంజాన్ హనుమాన్ గా మార్చుకున్నాడు. మీర్జాపుర్ ప్రాంతంలో ఉన్న హనుమాన్ గలీ ఆలయాన్ని కాషాయరంగు టైల్స్ తో, టెంపుల్ బయటకూడా అదే రంగుతో పునరుద్ధరించాడు. దీనికోసం అయిన ఖర్చును ఎంత అయిందో తెలపడానికి అతడు ఇష్టపడలేదు.

నమాజ్ చేయడం కోసం రోజుకు ఐదు సార్లు ఆ ఆలయం ముందునుంచే మసీద్ కు వెళ్తానని తెలిపాడు మీమాన్.హనుమాన్ ఆలయం దాదాపు శిథిలావస్థ స్థితిలో కన్పిపించడంతో ఎంతో బాధ కలిగిందని తెలిపాడు. దీంతో పూజారిని కలిసి..  పునరుధ్ధరిస్తానని చెప్పడంతో  సంతోషంగా అంగీకరించడంతో పనులు చేపట్టినట్లు తెలిపాడు. మరో వారంలో అన్నీ పనులు పూర్తవుతాయన్నాడు మీమాన్.

మీమాన్ చేపట్టిన  కార్యక్రమం కులమతాలకు అతీతంగా ఉందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates