ఆకట్టుకుంటున్న రాష్ట్రపతిభవన్ ఉద్యానోత్సవ్

GARDENప్రపంచంలోని అత్యంత అందమైన ఉద్యానవనాల్లో ఒకటి రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్. దేశ ప్రథమ పౌరుని నివాసంలో ఉండే మొఘల్ గార్డెన్స్ అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. అలాంటి ఉద్యానవనాన్ని సందర్శకుల కోసం ప్రారంభించారు రాష్ట్రపతి భవన్ అధికారులు. 15 ఎకరాల్లో ఉన్న పూదోటలో తామరపూల ఆకారంలో అందమైన ఆరు ఫౌంటైన్ లు… ప్రకృతిలో లభించే అన్ని రకాల వర్ణాల్లోని పూలు మొఘల్ గార్డెన్స్ లో చూడొచ్చు.

ప్రతి ఏడాదిలాగే 2018లో రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్ ప్రజలకు అందుబాటులోకొచ్చింది. ప్రతిఏటా ఓ నెలరోజులపాటు సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఈ గార్డెన్ లోకి అనుమతిస్తారు. 300 ఎకరాలున్న రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో మొఘల్ గార్డెన్ విస్తీర్ణం… 15 ఎకరాలు. ఇందులో మొత్తం 5 వేల చెట్లున్నాయి. 160 రకాల పూలమొక్కలు సందర్శకులను కనువిందు చేస్తాయి. మొఘల్స్ సంప్రదాయం… ఆ తర్వాత పాలించిన బ్రిటీష్ పద్ధతుల సమ్మేళనమే ఈ ఉద్యానవనం. సర్  ఎడ్వర్ట్  ల్యూటిన్స్  ఈ ఉద్యానవనం రూపకర్త. గత 10 ఏళ్లలో 48 లక్షల మంది ఈ మొఘల్  గార్డెన్ ను సందర్శించారు. అందాల హరివిల్లును మైమరిపిస్తూ… ప్రకృతి పూల సోయగాలతో కనువిందు చేస్తుంది మొఘల్ గార్డెన్స్. ఏటా ఉద్యానోత్సవ్ పేరుతో ప్రజల సందర్శనకు అనుమతిస్తున్నారు. పిబ్రవరి 6 నుంచి మార్చి 9 వరకు ఈ ఛాన్స్. సోమవారం తప్ప మిగతా రోజుల్లో రోజజ ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం 4 గంటల వరకు విజిటింగ్ టైమ్స్. నిర్వహణ పనుల కోసం ప్రతి సోమవారం మొఘల్స్ గార్డెన్స్ ను మూసివేస్తారు.

రైతులు, వికలాంగులు, పోలీసులు, రక్షణ శాఖ అధికారుల కోసం ప్రత్యేకంగా మార్చి 20వ తేదీని కేటాయించారు. సామాన్య ప్రజానీకం ఎవరైనా గేట్ నంబర్ 35 ద్వారా మొగల్ గార్డెన్ లోకి రానిస్తారు. రాష్ట్రపతి భవన్ లోని స్పిరిచువల్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, మ్యూజికల్ గార్డెన్  అని వేర్వేరుగా ఉంటాయి. రాష్ట్రపతి భవన్ ఆవరణలో 15 ఎకరాల్లో మొఘల్ ఉద్యానవనం విస్తరించి ఉంది. వందల రకాల పూల మొక్కలు, ఔషధ మొక్కలు, పండ్ల చెట్లతో ఉద్యానవనం మొత్తం… ప్రకృతి రమణీయతను పంచుతుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా బల్బ్ ఆకారపు పూల మొక్కలను తోటలో ఉంచారు. శీతాకాలంలో వికసించే రానున్ క్లస్, ట్యూలిప్స్ ఫ్లవర్స్ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. 8 రకాల విభిన్న రంగులల్లో 10 వేల ట్యూలిప్ మొక్కలున్నాయి.

ఈ మొక్కలు ఫిబ్రవరి చివరి వారం వరకు విరబూస్తూ అందాలను కనువిందు చేయనున్నాయి. ట్యూలిప్ మొక్కలను నెదర్లాండ్స్ నుండి తెప్పించి ప్రత్యేకంగా నాటారు. అబ్బురపరిచే అనేక రకాల గులాబీ పూలు, సంప్రదాయ, కొత్త రకాల గులాబీ మొక్కల మడులు, మొగల్ గార్డెన్ పై బాగంలో కనువిందు చేయనున్నాయి. సెంట్రల్ లాన్ లో తోటమాలుల నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పూల తివాచీలు ఆకట్టుకుంటాయి.

Posted in Uncategorized

Latest Updates