ఆకలికి తట్టుకోలేక : మండే ఎండలో ఇసుక తింటూ..

MANమండే ఎండలో ఏదో తింటున్నాడు. పిచ్చోదు కదా.. పేపర్లో అన్నం పెట్టుకు తింటున్నాడులే అని అందరూ లైట్ తీసుకున్నారు. అతడు తింటున్నది అన్నం కాదు, ఆకలికి తట్టుకోలేక ఎండలో కాలుతున్న ఇసుకని. దీంతో షాక్ అయిన అందరూ అతడి ఆకలి భాధను అర్ధం చేసుకుని సాయపడ్డారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదంటూ మనసులో అనుకున్నారు. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి హృదయాలను కలచివేస్తుంది.

తమిళనాడు రాష్ట్రంలోని థేనికి చెందిన గురుస్వామి(52) పని ఇస్తామని తన బంధువులు శబరిమళకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇక్కడ పని చేయడానికి నువ్వు సరిపోవంటూ ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వకుండా పంపించేశారు. చేతిలో ఉన్న కొంచెం డబ్బులతో 100 కిలోమీటర్ల దూరంలోని ఎరుమెలికి చేరుకున్నాడు. అక్కడ నుంచి థేనికి వెళ్లడానికి ఒక్కరూపాయి కూడా లేదు. దీనికితోడు రెండు రోజులు అన్నపానీయాలు లేకుండా కాలం గడిపాడు. ఆకలికి తట్టుకోలేక మండే ఎండలో ఓ ఆయుర్వేద షాప్ దగ్గర కూర్చొని ఓ కాగితంలో ఇసుక పోసుకుని దాన్ని తింటున్నాడు. స్ధానికులు కొందరు దీన్ని గమనించారు. అతడిని దగ్గర్లోని హోటల్ కి తీసుకెళ్లి భోజనం పెట్టించారు. విషయం తెలియడంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని సొంత ఊరు పంపేందుకు అవసరమైన డబ్బులు స్థానికుల సాయంతో అందించారు.

Posted in Uncategorized

Latest Updates