ఆకస్మికంగా చైనా పర్యటన రద్దు చేసుకున్న మమతా

MAMAచైనా పర్యటనను ఆకస్మికంగా క్యాన్సిల్ చేసుకున్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. విదేశాంగ శాఖ రిక్వెస్ట్ తో మమతా బెనర్జీ 9రోజుల పాటు చైనాలో పర్యటించాల్సి ఉంది. శుక్రవారం(జూన్-22) రాత్రి ఆమె విమానం ఎక్కాల్సి ఉంది. అయితే ఫ్లైట్ ఎక్కడానికి కొన్ని గంటల ముందు ఆమె పర్యటనను రద్దు చేసుకున్నారు. రాజకీయ సమావేశాలకు సంబంధించి చైనా కమ్యూనిస్ట్ లీడర్ షిప్ నుంచి సరైన స్ధాయిలో కన్ఫర్మేషన్ రానందున పర్యటన క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు బెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిత్రా చెప్పారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖకు తెలిపినట్టు చెప్పారు అమిత్ మిత్రా. నిన్న సాయంత్రం వరకూ అంతా సరిగ్గానే ఉందని, అయితే తగిన స్ధాయిలో చైనా పొలిటికల్ మీటింగ్ లను కన్ఫర్మ్ చేయలేదని దీంతో మమతాబెనర్జీ తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates