ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం : హరీష్

HARISHరాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. బుధవారం (మే-23) చెరువుల పునరుద్దరణపై వార్తలు రాసిన జర్నలిస్టులకు మిషన్ కాకతీయ అవార్డుల ప్రదానం చేశారు. మిషన్ కాకతీయతో మూడేళ్లలో 12 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించామన్నారు హరీష్.

నాలుగు విడతల్లో 18వేల చెరువులకు పైగా పునరుద్దరించగా.. మిగతావి పనులు నడుస్తున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలొచ్చాయన్నారు మంత్రి హరీష్ రావు.

Posted in Uncategorized

Latest Updates