ఆక్రమణల దారులు, వేటగాళ్లపై పీడీ యాక్టు : DGP

పర్యావరణ రక్షణ, అటవీ భూమిని కాపాడటం ప్రతీ పౌరుడి ప్రథమ విధి అన్నారు DGP మహేందర్ రెడ్డి. కొన్ని ప్రాంతాల్లో అటవీభూముల ఆక్రమణ చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు పోలీస్ శాఖ తరపున అటవీ శాఖకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.

ఆక్రమణల దారులు, వేటగాళ్లపై పీడీ యాక్టు పెట్టి కేసులు పెడతామన్నారు. పోలీస్ కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, DFOలతో మంగళవారం (జూలై-17) సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు DGP. పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయంతో అడవి ఆక్రమణ కాకుండా చూడాలన్నారు. ఆక్రమణల తర్వాత కేసులు పెట్టడం కంటే, ఆక్రమించకుండా ముందే చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలకు గురైన అటవీ భూములను గూగుల్ మ్యాపుతో ప్రచారం చేయాలన్నారు. పోలీస్ ఇంటలిజెన్స్ వ్యవస్థను ఆక్రమణలు, వేట వ్యవహారాల గుర్తింపుకు ఉపయోగిస్తామన్నారు డీజీపీ. ఆక్రమణల్లో పాల్గొంటున్న కూలీలపై కాకుండా.. నిజమైన నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates