ఆక్స్ ఫర్డ్ లోకి కొత్తగా 1400 పదాలు

లండన్: ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 1400 కొత్త పదాలు చేరాయి. ఇడియోక్రసీ,ఫ్రేజెస్,ఇడియమ్స్ కి కొత్తగా చోటు కల్పించారు. ఇడియోక్రసీ పదం ప్రజాస్వామ్య ప్రభుత్వం తెలివి తక్కువది అనే అర్ధాన్నిస్తుంది. పవర్ లేదా రూల్ అనే అర్ధంలో డెమోక్రసీ,అరిస్టోక్రసీ అనే పదాలను ఒకప్పుడు గ్రీకులు ఉపయోగించారు. 18వ శతాబ్దం నాటికి ఓక్రసీ అనే పదానికి ఇంగ్లీష్ పదాలు తోడవడంతో స్టాటోక్రసీ,మొబోక్రసీ అనే పదాలు రూపొందాయి.

డెమోక్రసీని ఎగతాళి చేస్తూ ఇడియెటోక్రసీ(1832).ఫూల్ క్రసీ(1909)లో అని మొదటసారి ఆంబ్రోస్ బియర్స్ అనే వ్యక్తి ఉపయోగించారు. ఇడియోక్రసీ అంటే ఇడియటిక్ ప్రభుత్వం అనే అర్ధం వచ్చేలా విమర్శిస్తూ ఇలాంటి పదాలను ఉపయోగించడం 19వ శతాబ్దంలో విపరీతంగా వాడుకలోకి వచ్చింది. అప్ డేట్ చేసిన డిక్ష‌నరీలో ఈ పదంతో పాటు మరో 14 వందల పదాలకు స్థానం కల్పించారు.

Posted in Uncategorized

Latest Updates