ఆగస్టు 14కు భగీరథ పనులు పూర్తి : ప్రశాంత్ రెడ్డి

మిషన్ భగీరథ పనులపై రివ్యూ చేశారు పథకం వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి. ఆగస్టు 15 లోగా రాష్ట్రమంతా మిషన్ భగీరథ నీళ్లివ్వాలని ఆదేశించారు. ప్రతీ రోజు 50 గ్రామాలకు కొత్తగా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. పనులు నెమ్మదిగా సాగుతున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. శనివారం (జూలై-21) హైద్రాబాద్ ఎర్రమంజిల్ లోని RWS కార్యాలయంలో అన్ని జిల్లాల SE లతో మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. RWS కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగా చీఫ్ ఇంజనీర్లుగా బాధ్యతలు తీసుకున్నవారు హైదరాబాద్ లో ఉండొద్దని, వాళ్లకు కేటాయించిన జిల్లాల్లోనే ఉండి పనులను నిరంతరం పరిశీలించాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates