ఆగస్టు 15నుంచి ఉచిత కంటి పరీక్షలు: సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలన్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంపై శనివారం(జూలై-21) సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

గజ్వేల్ నియోజకవర్గంలో తానే స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కూడా ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని… అవసరమైన వారికి కళ్లద్దాలు, మెడిసిన్లు అందివ్వాలన్నారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించాలని  సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates