ఆగస్టు 15నుంచి రైతు బీమా పేపర్ల పంపిణీ

kcr1వ్యవసాయంలో సంపూర్ణ యాంత్రీకరణ రావాలన్నారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో రైతు బీమాపై సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుబంధు, గిట్టుబాటు ధరలో వ్యవసాయ విస్తరణ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు.

ప్రతి 5వేల ఎకరాల క్లస్టర్ కు ఒక విస్తరణ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలో పండే పంటలకు స్థానికంతో పాటు ఇరుగు-పొరుగు రాష్ర్టాలతో మార్కెటింగ్ ఏర్పాట్లను ఏఈవోలు పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో పండే పంటలకు పొరుగు రాష్ట్రాల్లో మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రైతు చనిపోతే బీమా సొమ్మును క్లెయిం దగ్గర నుండి నామినికి చేరేవరకు ఏఈవో బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆగస్టు 15నుంచి రైతు బీమా పేపర్లు పంపిణీ చేస్తామన్నారు. అదే సమయంలో ప్రతి గ్రామంలో రైతు సదస్సులు నిర్వహిస్తామన్నారు. 4వతేదీ రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్లతో సమావేశమవుతామన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates