ఆగస్టు 15న రైతుబీమా సర్టిఫికెట్లు

రైతు చనిపోతే తక్షణమే రూ.5లక్షలు ఆ కుటుంబానికి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప పథకం రైతుబందు. 18-59 సంవత్సరాల రైతులు ఈ స్కీంకు అర్హలు. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు రైతుబీమకు అప్లై చేయాలని సూచించారు అధికారులు. మంగళవారం (జూలై-24) ప్రభుత్వ సీఎస్ SK జోషీ ఆధ్వర్యంలో జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎస్.. రైతు బీమా పథకంలో ఇప్పటివరకు 26.38 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ఆగస్టు 15న సీఎం కేసీఆర్‌ రైతులకు బీమా సర్టిఫికెట్లు అందిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో రైతులకు బీమా సర్టిఫికెట్లు అందించాలన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఆరు లక్షల డిజిటల్‌ సంతకాలు పూర్తయ్యాయని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన∙కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 4.5 లక్షలు, మండల స్థాయిలో 1.5 లక్షల పాసుపుస్తకాలను ముద్రించాల్సి ఉందని ఈ ప్రక్రియను వేగిరం చేయాలన్నారు. మిగతా పాసుపుస్తకాల డిజిటల్‌ సంతకాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు SK జోషి.
రైతు బంధు చెక్కులు పొందిన రైతులందరినీ సంప్రదించి అర్హులైన రైతులను బీమా పథకంలో చేర్చాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి సూచించారు.

Posted in Uncategorized

Latest Updates