ఆగస్టు 15న రైతులకు జీవిత బీమా: సీఎం

kcrఅన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. ఆగస్టు 15 నుంచి రైతులకు జీవిత బీమా పథకం ప్రారంభించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. రైతు బీమా పథకంపై సీఎం కేసీఆర్ ..పథకంపై ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో చర్చించారు. దీనికోసం రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎల్‌ఐసీతో ఒప్పందం ద్వారా రైతు బీమా పథకం అమలు చేస్తామన్నారు. రైతు ఏకారణంతో మరణించినా బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు.

రైతు బీమాకు సంబంధించి ఆగస్టు 1నే మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. సాధారణ మరణమైనప్పటికీ నామినీకి 10 రోజుల్లోగా రూ. 5 లక్షల బీమా చెల్లిస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు రైతులకు బీమా వర్తించేలా LIC తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నామన్నారు. దీనికోసం ఆధార్ కార్డులో పుట్టిన తేదీని లెక్కలోకి తీసుకోనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates