ఆగస్టు 15వ తేదీ నుంచి రైతులందరికీ బీమా : హరీశ్

harishraoపట్టాదార్ పాస్ బుక్ ఉన్న ప్రతీ రైతుకు వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం చించల్‌పేట గ్రామంలో రూ. 3.30 లక్షల నిధులతో విద్యుత్ సబ్ స్టేషన్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రులు హరీష్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఏ కారణంతోనైనా రైతు చనిపోయినా రూ. 5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. రైతులకు సాగునీరు, ఫ్రీ కరెంట్, రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి అందిస్తున్నామని తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates