ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం : కేసీఆర్

మిషన్ భగీరథ, కంటి వెలుగు కార్యక్రమంపై అధికారులతో రివ్యూ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆగస్టు 15 న మధ్యాహ్నం రాష్ట్రవ్యాప్తంగా 799 చోట్ల కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో తాను కార్యక్రమాన్ని మొదలు పెడతానని చెప్పారు ముఖ్యమంత్రి. ప్రతీ కేంద్రంలో కచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కంటి పరీక్షలు చేయడానికి అవసరమైన సిబ్బంది, పరికరాలు, మందులు, అద్దాలను గ్రామాలకు చేర్చాలని సూచించారు. మరోవైపు ఆగస్టు 14 అర్థరాత్రి నుంచి రాష్ట్రం మొత్తం మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులపై అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.

Posted in Uncategorized

Latest Updates