ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు : అవసరమైన వారికి అక్కడే కళ్ల జోళ్లు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కంటి వెలుగు ప్రొగ్రామ్ ని సక్సెస్ చేయాలన్నారు వైద్యారోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి. హైద్రాబాద్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో.. సమీక్ష చేశారు. ఆగస్టు 15 నుంచి ఎంతమంది విధులు నిర్వహిస్తారు.. ఎక్విప్ మెంట్స్ సమస్య ఉందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

కంటి పరీక్షలతో పాటు.. దగ్గరి చూపు సమస్య ఉంటే అప్పటికప్పడు రీడింగ్ అద్దాలను ఇవ్వాలని సూచించారు. క్యాటరాక్ తో పాటు మిగితా సర్జరీలకు జిల్లా కేంద్రాలతో పాటు.. సరోజిని కంటి ఆస్పత్రికి ప్రత్యేక వాహనంలో తరలించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో క్యాంపులు నిర్వహించి 3 కోట్ల 70 లక్షలమందికి కంటి పరీక్షలు చేస్తామంటున్నారు మంత్రి. రోజులో 250 మందివరకు పరీక్షలు జరపాలని, అక్కడే భోజనంతో పాటు సిబ్బంది వసతులు ఏర్పాటుకు పక్కాప్లాన్ చేసుకోవాలని ఆదేశించారు.

Posted in Uncategorized

Latest Updates