ఆగస్టు 2 నుంచి కొత్త గ్రామ పంచాయతీలు : జూపల్లి

ఆగస్టు 2 నుంచి కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు జరుగుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటుపై సోమవారం (జూలై-30) సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడారు జూపల్లి. కొత్త గ్రామపంచాయతీ ప్రారంభోత్సవాల సందర్భంగా.. గ్రామాల్లో పండుగవాతావరణం రానుందన్నారు. పరిపాలనా సౌలభ్యంకోసం కార్యదర్శుల నియామకం ఉంటుందన్నారు. 12 వేల 751 పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు ఉంటారన్నారు. గ్రామాల రూపు రేఖలను పూర్తిగా మారుస్తామని చెప్పారు. గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. పల్లెలు కూడా పట్టణాల్లాగా అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.

నేను నాదీ అని కాకుండా మనందరి గ్రామం అని గ్రామస్థులు అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవాలన్నారు. హరితహారంలో అందురూ పాల్గొనాలని సూచించారు మంత్రి జూపల్లి. సీఎం ఏ పని చేసినా ప్రజలకు మేలు జరిగేలా చేస్తారే తప్పా..రాజకీయం ఉండదన్నారు. కాంగ్రెస్ అనవసరంగా దుష్ప్రచారం చేస్తుందన్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణ..తండాలను గుర్తించి, గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. గ్రామపంచాయతి ఎన్నికలపై మాట్లాడిన జూపల్లి.. బీసీ లెక్కలు పూర్తవగానే హైకోర్టు తీర్పు ఉంటుందన్నారు. తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు మంత్రి జూపల్లి.

Posted in Uncategorized

Latest Updates