ఆగస్ట్ 1 నుంచి వందరోజుల ప్రచారం : ఉత్తమ్

వచ్చే ఎన్నికల్లో  గెలుపుపై  ధీమాగా ఉన్నారు  పీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి. నియోజకవర్గాల్లో  ఆశావహులు, అభ్యర్థుల  గెలుపోటములపై  సొంతంగా సర్వే చేయిస్తున్నారని  మీడియా  చిట్ చాట్ లో  చెప్పారు. నెలాఖరు వరకు రిజల్ట్ వస్తుందన్న ఆయన….ముందస్తుగా  సీట్లు ప్రకటించడమే  మంచిదని ఆశావహులు అంటున్నట్టు  తెలిపారు. AICC  కార్యదర్శల  పర్యటనల్లోనూ ఇలాంటి  అభ్యర్థనలే  వచ్చాయన్నారు. ఆగస్ట్ 1 నుంచి వంద  రోజుల ప్రచారం ఉంటుందన్నారు ఉత్తమ్.  సర్వే ఫలితాలు  వచ్చిన తర్వాత  AICC చీఫ్  రాహుల్ గాంధీకి  ఒక్కో నియోజకవర్గంలో  ముగ్గురు అభ్యర్థులతో  రిపోర్ట్ ఇస్తానని  చెప్పారు ఉత్తమ్.

Posted in Uncategorized

Latest Updates